![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -457 లో......శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని రామరాజు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తాడు. పార్టీకి నర్మద పేరెంట్స్ ని కూడా తీసుకొని వస్తాడు ధీరజ్. నర్మద మెడలో నగలు చూసి.. అవి ప్రేమ నగలు కదా అని నర్మద వాళ్ళ అమ్మ అడుగుతుంది. అవునని నర్మద చెప్తుంది. అవి నావి.. అక్కవి అని తేడా లేదు మావి అని ప్రేమ అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి తన కడుపుని చూసి మురిసిపోతుంది. అప్పుడే భాగ్యం వచ్చి.. అమ్మడు తన కడుపులో నిజంగా బిడ్డ ఉందనుకొని మురిసిపోతుంది లేదని తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందోనని భాగ్యం అనుకుటుంది. ఏంటి అమ్మడు అలా చూసుకుంటున్నావని శ్రీవల్లిని భాగ్యం అడుగుతుంది.
నా కడుపులో బిడ్డ ఉందని వల్లి హ్యాపీగా చెప్తుంది. అప్పుడే ఆనందరావు వస్తాడు. అమ్మ నా పొట్టలో పాప ఉంటే పెద్దగా అవడం లేదని వల్లి అంటుంది. అసలు ఉంటేనే కదా అని భాగ్యం అనగానే వల్లి షాక్ అవుతుంది. అంటే ఈ రోజే కదా ప్రెగ్నెంట్ అని తెలిసింది. అలా ఎలా ఇప్పుడే పొట్ట పెద్దగా అవుతుందని భాగ్యం కవర్ చేస్తుంది. అప్పుడే ధీరజ్, చందు ఇద్దరు వల్లిని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. బా నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని చందు చెయ్ పట్టుకుంటుంది వల్లి.. దాంఓ చందు కోపంగా తీసేస్తాడు. వదిన ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మీ కడుపులో బిడ్డ ఉంది అన్న కారణంతోనే మీరు ఈ ఇంట్లో ఉన్నారు.. ఈ ఆనందం స్పాయిల్ చేయకండి అని ధీరజ్ అంటాడు. అంటే మా అమ్మడు కడుపులో బిడ్డ లేదు.. ఇదంతా యాక్టింగ్ అని ఆనందరావు అనగానే ధీరజ్, చందు షాక్ అవుతారు. మరేంటి అల్లుడు మేం ఏదో అబద్ధం ఆడినట్లు మాట్లాడుతున్నావని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత ధీరజ్, చందు ఇద్దరు కలిసి వల్లిని తీసుకొని వెళ్తారు.
ఆ తర్వాత ఏంటి భాగ్యం సైలెంట్ గా ఉన్నావ్.. ఇప్పుడు మా అమ్మడు కడుపులో బిడ్డ మనకి ఆయుధం అని ఆనందరావు అనగానే కడుపు లేదు.. ఏం లేదు.. వల్లి ఈ ఇంట్లో అడుగుపెట్టాలని అబద్దం చెప్పించానని భాగ్యం అనగానే ఆనందరావు షాక్ అవుతాడు. నిజం తెలిస్తే పరిస్థితి ఏంటని ఆనందరావు భయపడుతాడు. వల్లిని ధీరజ్, చందు, సాగర్ పల్లకిలో తీసుకొని వస్తారు. అదేసమయంలో పల్లకిలో ప్రేమని తీసుకొని వస్తున్నట్లు ధీరజ్ ఉహించుకుంటాడు. ఆ తర్వాత వల్లికి రామరాజు పెద్దకూతురు కామాక్షి మొదట అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే బాగుంటుందని రామరాజు అంటాడు. మరొకవైపు కామాక్షి మెట్లపై కూర్చొని కట్నం కావాలని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |